Last Updated:

AP Capital : అమరావతి పనులు ఇక పరుగులే.. హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం

AP Capital : అమరావతి పనులు ఇక పరుగులే.. హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం

AP Capital : ఇక నుంచి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి రూ.11వేల కోట్లు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం-హడ్కో మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. రుణానికి సంబంధించిన తాజాగా సీఆర్డీఏతో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కుల్ కృష్ణ ఒప్పంద పత్రాలపై మంత్రి నారాయణ సంతకాలు చేశారు. ఇవాళ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణతోపాటు సీఆర్డీఏ అధికారులను కలిశారు. అన్ని స్థాయిల్లో చర్చలు విజయవంతం కావడంతో ఒప్పందాన్ని ఆయన లాంఛనం చేశారు. దీంతో అమరావతి అభివృద్ధికి రూ.11వేల కోట్ల రుణం అందినట్లైంది.

 

మరోవైపు రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సైతం ఇప్పటికే ముందుకు వచ్చాయి. రెండు బ్యాంకుల నుంచి రూ.15 వేల కోట్ల రుణం ప్రభుత్వానికి లభించింది. తాజాగా హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రూ.26 వేల కోట్లతో అమరావతి నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో భాగంగా కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతి పనులు ఊపందుకోనున్నాయి.

 

దుర్గమ్మ సన్నిధిలో హడ్కో అధికార బృందం..
అంతకుముందు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి హడ్కో అధికారం బృందం వచ్చింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుల్షరెస్టా, కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ నాగరాజు, ఫైనాన్స్ డైరెక్టర్ దిల్జిత్ సింగ్ కటారి, ఏపీ రీజినల్ చీఫ్ బిఎస్ఏ మూర్తి, ఇతర అధికారులు శ్రీనివాస్ సుబ్బారావు ఆలయ సంప్రదాయం ప్రకారం పండితులు ఘన స్వాగతం పలికి శఅమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి: