Pawan Kalyan Movie Update: షాకింగ్.. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఆ స్టార్ హీరోయిన్ అవుట్?

Star Heroine Leaves From Pawan Kalyan Big Project: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన సినిమా చిత్రీకరణపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటూ రాజకీయాల్లో ప్రజా సేవలో నిమగ్నమైన ఉంటున్న ఆయన మరోవైపు వీలు చిక్కినప్పుడు తన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
పవన్ ఖాతాలో మూడు సినిమాలు
ఈ క్రమంలో ఆయన సంతకం చేసిన మూడు చిత్రాల్లో రెండింటిపైనే గ్యారంటీ ఉంది. ఒక సినిమా క్యాన్సిల్ అయినా అవ్వోచ్చనే టాక్ వినిపిస్తోంది. దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఆందోళణ చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి మరో షాకిచ్చే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ హీరోయిన్ అవుట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసి అభిమానులంత షాక్ అవుతున్నారు. ఇంతకి ఆ స్టార్ హీరోయన్ ఎవరు? ఆ సినిమా ఏంటనేది చూద్దాం!
ఏపీ ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. అందులో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. అన్ని కూడా షూటింగ్ మొదలుపెట్టారు. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం 20 శాతం మాత్రమే షూటింగ్ జరుపుకుటుంది. పైగా అందులో కొన్ని సీన్స్ బాగాలేని డిలీట్ కూడా చేశారు. ఉన్నదాంట్లోనే నుంచి కాస్తా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఊరిస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో రిలీజ్ స్పెషల్ వీడియో ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ మించి ఈ చిత్రం ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి.
వీరమల్లు, ఓజీపైనే ఫోకస్
అయితే ప్రస్తుతం అందరి ఫోకస్ అంతా ఓజీ, హరిహర వీరమల్లుపైనే ఉన్నాయి. పవన్ కూడా ఈ చిత్రాల షూటింగ్‌పైనే ఫుల్ ఫోకస్డ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అసలు ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమా ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీలను కన్ఫాం చేసినట్టు అప్పట్లో మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు పవన్, శ్రీలీలకు సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఇప్పుడీ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకోవాలనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రీలీల తప్పుకుందా?
ప్రస్తుతం తనకున్న ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ అమ్మడు ఈ బిగ్ ప్రాజెక్ట్‌ని వదుకోవాలని ఆలోచిస్తున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం తను బాలీవుడ్లో, తెలుగులో, సౌత్‌లో పలు చిత్రాలు చేస్తుంది. మరోవైపు తన ఎంబీబీఎస్ చదువును కూడా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు ఉన్న సినిమాల లైనప్ కారణంగా కాల్షిట్ని అడ్జెస్ట్ చేసుకోలేకపోతుంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి వైదోలగాలని నిర్ణయించుకుంటుందట. ఇప్పటికే తన నిర్ణయాన్ని మేకర్స్ కూడా చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ యంగ్ బ్యూటీ స్వయంగా చెప్పేవరకు వేయిట్ చేయకతప్పదు.