Last Updated:

Congress President Polls: గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ అధ్యక్ష స్థానానికి పోటీపడరు.. అశోక్ గెహ్లాట్‌

గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి పార్టీ అధ్యక్షుడు కాకూడదని పార్టీ అధినేత రాహుల్ గాంధీ  చెప్పారని  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ఫష్టం

Congress President Polls: గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ అధ్యక్ష స్థానానికి పోటీపడరు.. అశోక్  గెహ్లాట్‌

Delhi: గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి పార్టీ అధ్యక్షుడు కాకూడదని పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ఫష్టం చేసారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత వదులుకున్న కీలక పదవిని రాహుల్ గాంధీ చేపట్టేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

“కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరి ప్రతిపాదనను అంగీకరించాలని నేను అతనిని (కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ) చాలాసార్లు అభ్యర్థించాను. గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి చీఫ్ కాకూడదని ఆయన స్పష్టం చేశారు” అని గెహ్లాట్ చెప్పారు. ఈరోజు కేరళలో ఆచప మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. దేశ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్, పార్టీ ఎంపీ శశిథరూర్‌లు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే పార్టీ, ఒక పదవి” కోసం కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న విషయం తెలిసిందే. అందువలన గెహ్లాట్ పార్టీ చీఫ్ గా ఎన్నికయితే తన సీఎం పదవిని వదులుకోవలసి ఉంటుంది. ఈ అంశం పై రాజస్థాన్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్, సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని గెహ్లాట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: