Last Updated:

Samsung Mobile Offers: ఐపాయే.. 95 వేల ఫోన్ సగం కంటే తక్కువ ధరకే.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడైనా చూశారా..?

Samsung Mobile Offers: ఐపాయే.. 95 వేల ఫోన్ సగం కంటే తక్కువ ధరకే.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడైనా చూశారా..?

Samsung Mobile Offers: ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇటీవల, మెరుగైన ఫీచర్లతో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు కూడా పెరిగాయి. దీని ప్రకారం సామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ‘Samsung Galaxy S23 5G’ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మీరు ఈ సామ్‌సంగ్ ఫోన్‌ను సగం ధరకే కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ బేస్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లను తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S23 5G Highlights
ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, బడ్జెట్ కొంచెం ముఖ్యం. ప్రస్తుతం సామ్‌సంగ్ సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Galaxy S23 ఫోన్ 256GB వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఫోన్ కోసం 50,000. వరకు రాయితీలు అందజేస్తున్నారు అంటే, 56 శాతం పెద్ద తగ్గింపు లభిస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G మొబైల్ 256GB వేరియంట్ ధర రూ.95,999గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.41,999కే అందుబాటులో ఉంది.

Samsung Galaxy S23 5G Offers
మీరు ఈ సామ్‌సంగ్ ఫోన్‌ని ఫ్లిప్‌‌కార్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. IDFC బ్యాంక్ కార్డ్‌లపై 750 వరకు అదనపు తగ్గింపును అందజేస్తున్నారు. అలాగే పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే రూ.39,150 వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు రూ.15,000 ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.26,999కే మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S23 5G Features
సామ్‌సంగ్ గెలాక్సీ S23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్‌డి ప్లస్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,750 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2కి ప్రొటక్షన్ అందించారు. మొబైల్ పనితీరులో సాటిలేనిది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OneUI 5.1 OSతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM + 256GB స్టోరేజ్, 8GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.

ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 10-మెగాపిక్సెల్ మూడవ కెమెరాను కూడా ఉంది. సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ 3900mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 25W వైర్డు ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. మొబైల్ దుమ్ము ,నీటి నుండి రక్షణ కోసం IP68 రేట్ చేశారు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.