Last Updated:

Ayan Mukherjee Father Died: ‘వార్‌ 2’ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం

Ayan Mukherjee Father Died: ‘వార్‌ 2’ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం

Ayan Mukherjee Father Deb Mukherjee Died: బ్రహ్మస్త, వార్‌ 2 డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్‌ ముఖర్జీ(83) తాజాగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (మార్చి 14) తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.ఆయన మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తిం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ముంబైలోని పవన్‌ హన్స్‌ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన అంత్యక్రియలకు కాజోల్‌, అజయ్‌ దేవగన్‌,రాణి ముఖర్జీ, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, తనీషా, తనూజ, హృతిక్ రోషన్, సిద్ధార్త్‌ మల్హోత్రా వంటి ప్రముఖులు హజరు అవుతారని తెలుస్తోంది. కాగా దేబ్‌ ముఖర్జీ ఎన్నో సినిమాల్లో నటించి హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అధికార్‌, సికిందర్‌, అన్సూబాన్‌ గయే ఫూల్‌, దో ఆంఖేన్‌, అభినేత్రి, బాటన్‌ బాటన్‌ మే, కమినీ, గుడ్గునీ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయనకు రెండు పెళ్లిళ్లు కాగా.. రెండో భార్య సంతానమే అయాన్‌ ముఖర్జీ. ఇక హీరోయిన్లు కాజోల్‌, రాణి ముఖర్జీలు ఆయనకు మేనకోడళ్లు వరుస అవుతారు.