Last Updated:

Pawan Kalyan: అకీరా టాలీవుడ్ ఎంట్రీ.. ఓజీ 2 తోనా.. పవన్ ప్లాన్.. ?

Pawan Kalyan: అకీరా టాలీవుడ్ ఎంట్రీ.. ఓజీ 2 తోనా.. పవన్  ప్లాన్.. ?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. ఇక పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఆయన నటవారసుడిగా అకీరా రంగంలోకి దిగుతాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అకీరా తండ్రిని మించిన అందంతో హీరోలను తలపిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వారసుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అకీరా టాలీవుడ్ ఎంట్రీ మిస్టరీగా మారింది. ఈమధ్యన అకీరా.. తండ్రితో పాటు కనిపిస్తున్నాడు.

 

ఇక ఇదంతా  పక్కన పెడితే.. పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. ఆయన ఓకే చెప్పిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫినిష్ చేయాల్సిన బాధ్యత ఆయనమీద ఉంది. అందులో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాను DVV దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఇప్పటికే OG  నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు రికార్డులు సృష్టించాయి. ఇకపోతే OGకి హీరో అడివి శేష్ కు ఉన్న సంబంధం ఏంటి.. ? ఆయన ఎందుకు శేష్ మాట వినాలి.. ? అనే డౌట్ రావచ్చు.  డైరెక్టర్ సుజీత్, అడివి శేష్ మంచి ఫ్రెండ్స్. శేష్.. మాఫియా సినిమాలు తీయడంలో దిట్ట. అందుకే OG స్క్రిప్ట్ వర్క్ లో శేష్ ను కూడా యాడ్ చేశారు. అందులో కూడా రేణు దేశాయ్ కు శేష్ మంచి స్నేహితుడు. అకీరా, ఆద్య ఎప్పుడు శేష్ తోనే కనిపిస్తూ ఉంటారు.

 

ఇక OG  స్క్రిప్ట్ రాసేటప్పుడే.. శేష్, పవన్ తో కొన్ని ఆలోచనలను పంచుకున్నాడట. OG కథను రెండు భాగాలుగా తీద్దామని, మొదటి భాగం చివర్లో అకీరాను పరిచయం చేసి.. రెండో భాగంలో అతడినే హీరోగా లాంచ్ చేయొచ్చు అనే అభిప్రాయాన్నివెల్లడించాడట. అయితే పవన్ మాత్రం వాటిని తిరస్కరించాడని టాక్ నడుస్తోంది. నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి ప్లాన్. కొడుకును దగ్గరుండి పరిచయం చేయొచ్చు.

 

అయితే ఇందుకు పవన్ ఒప్పుకోకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్.. సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవల మీద నడుస్తున్నాడు. ఇప్పుడు OG రెండో భాగం అంటే.. ఇంకా కొన్ని నెలలు ఈ సినిమా కోసం పనిచేయాలి. అది తనవలన కాదని, ఒక పార్ట్ తోనే సినిమాను ముగించాలని సుజీత్ కు చెప్పాడట పవన్. ఇక అకీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా పవన్ క్లారిటీ ఇచ్చాడట. ఇప్పుడప్పుడే అకీరాను సినిమాల్లోకి తీసుకురావాలని లేదని, అందుకు చాలా టైమ్ ఉందని చెప్పాడట. దీంతో అడివి శేష్ OG 2 ప్లాన్ ఇలా బెడిసికొట్టింది. మరి అకీరా ఎప్పుడ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడో కాలమే నిర్ణయించాలి.

ఇవి కూడా చదవండి: