Last Updated:

Oppo F29 Pro+5G-Oppo F29 Pro 5G: ఒప్పో నుంచి కిరాక్ ఫోన్లు.. ఫీచర్స్, ప్రైస్ లీక్.. త్వరగా ఓ లుక్కేయండి..!

Oppo F29 Pro+5G-Oppo F29 Pro 5G: ఒప్పో నుంచి కిరాక్ ఫోన్లు.. ఫీచర్స్, ప్రైస్ లీక్.. త్వరగా ఓ లుక్కేయండి..!

Oppo F29 Pro+5G-Oppo F29 Pro 5G: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Oppo F29 Pro+ 5G- Oppo F29 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలకు సంబంధించి మరో సంతోషకరమైన వార్త వచ్చింది. ఓ టెక్ వీరుడు వీటి ధరలు, ఫీచర్లను వెల్లడించాడు. డిసెంబర్ 2024లో చైనాలో లాంచ్ అయిన Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాగా, Oppo F29 Pro 5G సిరీస్ ఫోన్‌లలో కూడా ఇలాంటి ఫీచర్లు ఉంటాయని తెలిపాడు. మరి, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఏమిటి ? వాటి ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.

Oppo F29 Pro+5G-Oppo F29 Pro 5G Price And Features
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. Oppo F29 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25,000. ఇది తక్కువ ధరకే లభించనుంది. స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌లలో వస్తుంది. మరోవైపు, Oppo F29 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,000. ఇది 8GB + 128GB, 8GB + 256GB,12GB + 256GB వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఓప్పో F29 ప్రో సిరీస్‌లోని Oppo F29 Pro+ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ Oppo F29 ప్రో హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్‌తో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంది.Oppo F29 Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoCని కలిగి ఉండే అవకాశం ఉంది.

అదనంగా, స్మార్ట్‌ఫోన్ LPDDR4X RAM, UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15తో వస్తుంది. 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేయవచ్చని భావిస్తున్నారు. ప్రో+ వెర్షన్ లాగా, ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

పాత లీక్ ప్రకారం, Oppo F29 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల 120Hz ఫుల్-HD+ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, OIS మద్దతుతో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండచ్చు. అయితే, ఈ విషయాలపై కంపెనీ నుండి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.