Regina Cassandra: చీరలో వయ్యారాలు పోతున్న రెజీనా – చూస్తే మతిపోవాల్సిందే!

Regina Cassandra Latest Photos: రెజీనా కాసాండ్రా.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. శివ మనసులో శ్రుతి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత రొటీన్ లవ్‌స్టోరీ చిత్రంతో యూత్‌ని ఆకట్టుకుంది.

ఆ వెంటనే వరుసగా మెగా హీరోల సరసన నటించి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కొత్త జంట అల్లు శిరీష్‌తో, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ సరసన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది.

అప్పట్లో తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది ఈ భామ. అలా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ నటిగా రాణించింది. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గడంతో వెండితెరకు దూరమైంది.

దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. తమిళ్, తెలుగు అడపదడప అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ముందుకు వెళుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆచార్య, 'శాకిని డాకిని'తో తెలుగులో తన లక్ పరిక్షించుకోవాలనుకుంది.

కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తమిళంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటున్న రెజీనా.. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మూకుత్తి అమ్మన్ 2' లో కీలక పాత్ర పోషించనుంది.

మూకుత్తి అమ్మన్ 2 (తెలుగులో అమ్మోరు తల్లి 2)గా రానున్న ఈ సినిమా నిన్న పూజ కార్యక్రమంతో మొదలైంది. సుందర్ సీ దర్శకత్వంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నయన్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

చెన్నైలోని అమ్మవారి గుడిలో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి నయనతార, రెజీనా, ఖుష్బు, డైరెక్టర్ సుందర్ సితో ఇతర మూవీ టీం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న ఫోటోలను రెజీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

"వీటిని లైట్ కెమెరా.. యాక్షన్.. 'ముకుత్తి అమ్మన్ 2' మొదలైంది. ఈ రోజు నేను అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి వేదికను పంచుకున్నాను. వారితో నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ క్షణాలు నన్ను కదలించాయి.

ఈ అనుభూతి నాకు చాలా కొత్తగా, అరుదగా అనిపించాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నేనూ భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉం ది. మీ ప్రేమకు ధన్యురాలి" అంటూ రాసుకొచ్చింది.

ఈ కార్యక్రమానికి రెజీనా చీరకట్టులో హాజరై ఆకట్టుకుంది. చీరలో రెజీనా వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.