Telangana Crime: మలకపేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అక్క కోసం భర్తే చంపాడు!

Big Twist in Malakpet Sirisha Death Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్యను భర్త వినయ్ కుమార్ హత్య చేసినట్లు తేలింది. అయితే గత కొంతకాలంగా వినయ్ సోదరి సరితకు, శిరీషకు గొడవ జరిగిందని, ఈ విషయంలో అక్కకు ఎదురు తిరుగుతోందన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.
చివరకు శిరీషకు మత్తుమందు ఇచ్చి వినయ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే శిరీస్ స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అంతకుముందు శిరీష గుండెపోటుతో చనిపోయిందని శిరీష సోదరి స్వాతికి వినయ్ చెప్పాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న మేనమామకు విషయం తెలిపింది. దీంతో అతను వచ్చే వరకు మృతదేహం అక్కడే ఉంచాలని మేనమామ చెప్పాడు. ఆయన వచ్చేలోగా శిరీష మృతదేహాన్ని వినయ్ అంబులెన్స్‌లో తరలించారు.
విషయం తెలుసుకున్న శిరీష మేనమామ పోలీసుల సహాయంతో అంబులెన్స్‌ను ట్రేస్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి అచ్చంపేట దోమలపెంట దగ్గర పట్టుకున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోస్టుమార్టం రిపోర్టులో హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. అనంతరం వినయ్‌తో పాటు ఆయన సోదరి సరితను పోలీసులు అరెస్ట్ చేశారు.