Last Updated:

Mahesh Babu: మహేష్‌ ఫైనల్‌ లుక్‌ రివీల్‌ – జూలు విదిల్చిన సింహంలా సూపర్‌ స్టార్‌, సోషల్‌ మీడియా షేక్‌..!

Mahesh Babu: మహేష్‌ ఫైనల్‌ లుక్‌ రివీల్‌ – జూలు విదిల్చిన సింహంలా సూపర్‌ స్టార్‌, సోషల్‌ మీడియా షేక్‌..!

Mahesh Babu SSMB29 Latest Look Leaked: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్‌ వరల్డ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది. SSMB29 అనే ప్రాజెక్ట్‌ టైటిల్‌తో రూపుదిద్దుకోనుంది. గుట్టుచప్పుడు కాకుండా మూవీని లాంచ్‌ చేసిన టీం సైలెంట్‌ షూటింగ్‌ కూడా మొదలెట్టారు. ఆ మధ్య జైలులో బంధించిన సింహం ఫోటోకి ముందు రాజమౌళి పాస్‌పోర్ట్‌ పట్టుకుని నవ్వుతూ నిలబడిని పోస్ట్‌ షేర్‌ చేశారు.

దీంతో ఎస్‌ఎస్‌ఎంబీ29 షూటింగ్ మొదలైందని అంతా అభిప్రాయపడ్డారు. ఇది తెలిసి అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఇందులో అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే చిత్రమనే విషయం తెలిసిందే. హాలీవుడ్ చిత్రం జేమ్స్‌బాండ్‌ తరహాలో ఉండనుందని ఇప్పటికే జక్కన్న స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా కోసం మహేష్‌ బాబు ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారు. బాడీ బిల్డింగ్‌ నుంచి హెయిర్‌ స్టైల్‌ వరకు అన్ని మార్చేశాడు. క్లాస్‌గా చాక్‌లేట్‌ బాయ్‌ ఉండే మహేష్‌ ఈ చిత్రం కోసం మాస్‌ అవతార్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు.

తాజాగా SSMB29కి సంబంధించి ఫైనల్‌ లుక్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. జిమ్‌లో మహేష్‌ అటూ ఇటూ నడుస్తూ కనిపించాడు. ఇందులో గుబురు కర్లీ హెయిర్‌తో కనిపించాడు. చెప్పాలంటే సింహం జూలులా గుబురు హెయిర్‌తో కనిపించాడు. దీంతో మహేష్‌ లుక్‌ని సింహంతో పోలుస్తూ అభిమానులంతా తెగ మురిసిపోతున్నారు. సింహం జూలు విదిలించిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాగా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌గా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్‌ నటీనటులు నటించబోతున్నారు. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by BOB Jr (@bob_jr__)

ఇవి కూడా చదవండి: