Govinda: విడాకుల వార్తలపై నటుడు గోవింద ఫస్ట్ రియాక్షన్, విభేదాలు నిజమే.. అందుకే!

Actor Govinda About His Divorce: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, అతడి భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయని, అందుకు వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి విడాకుల వార్తలు విని అందా షాక్ అవుతున్నారు. అయితే తాజాగా తన విడాకుల వార్తలపై స్వయంగా నటుడు గోవింద స్పందించారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆయనకు విడాకులపై ప్రశ్న ఎదురైంది. ‘ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నాను.
అలాగే వ్యాపార నిమిత్తం తరచు మా ఇంటికి ప్రముఖులు వస్తున్నారు. వ్యాపార విషయాలపై, నా కొత్త సినిమాల విషమైన వారంత మాట్లాడేందుకు వస్తున్నారు. తరచూ ప్రముఖులు మా ఇంటికి వస్తూ పోతుండటంతో మా విడాకుల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి’ అని అన్నారు. వారి విడాకులపై గోవింద మేనేజర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఫ్యామిలీకి చెందిన కొందరు చేసిన కామెంట్స్ కారణంగానే విడాకులు వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. వారి మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే. కానీ విడాకులు తీసుకునేంత అంత పెద్దవి కావు’ అని స్పష్టం చేశారు.
కాగా కొద్ది రోజుల క్రితం గోవింద భార్య సునీత ఆహుజా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన భర్త గోవింద తను వేర్వేరుగా ఉంటున్నామన్నారు. ఆపై తన పిల్లలతో కలిసి వేరుగా నివసిస్తున్నట్టు ఆమె చెప్పారు. పిల్లలతో కలిసి ఆమె వేరుగా ఉంటున్నానని చెప్పగానే వీరి విడాకుల వార్తలు గుప్పుమన్నాయి. గోవింద ఎప్పుడు తన వర్క్ లో బిజీగా ఉంటూ.. తన జీవితాన్ని పనికే అంకితం చేశారు, వచ్చే జన్మ ఉంటే మళ్లీ ఆయనకు భార్య గా ఉండాలని మాత్రం కోరుకోవడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక గోవింద, సునీతలు 1987లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వారికి టీనా అహుజా, యశోవర్దన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు విడాకులు తీసుకుని విడిపోతున్నారనే వార్తలు రావడంతో ఈ జంట అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.