Niharika: ఓటీటీకి మెగా డాటలర్ నిహారిక మద్రాస్ కారణ్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Niharika Madraskaaran Telugu OTT Release: మెగా డాటర్ నిహారిక నటించిన తమిళ సినిమా ‘మద్రాస్ కారణ్’ తెలుగు వెర్షన్ ఓటీటీకి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళంలో జనవరి 10న కోలీవుడ్ లో విడుదలైంది. ఇందులో షేన్ నిగమ్, కలైయరాసన్ లు హీరోలుగా నటించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
దీంతో నెల రోజుల ముందే ఈ చిత్రం తమిళంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఓటీటీకి తీసుకువస్తున్నట్టు తాజాగా ప్రకటన వచ్చింది. శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 26న ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద కోటీ రూపాయలు మాత్రం వసూల్లు చేసింది. వాలిమోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బి. జగదీస్ నిర్మించిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.