UPSC CSE: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

UPSC Civils 2025: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఈ నెల 11తో ముగియగా, అధికారులు గడువును 18 వరకు పొడిగించారు. గడువు నేటితో ముగియడంతో ఈ నెల 21 వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6 వరకు అప్లై చేసుకోవచ్చు.