Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Keerthy Suresh New Movie Baby John On OTT: ‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్లో నటించిన తొలి మూవీ ‘బేబీ జాన్’. ఈ మూవీ ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ నటించిన తేరీ(పోలీసోడు) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.