Last Updated:

Pushpa 2 Box Office Collection: బాక్సాఫీసు రప్పా.. రప్పా – ‘పుష్ప 2’ ఫైనల్‌ కలెక్షన్స్‌ అవుట్, ఎన్ని కోట్లంటే!

Pushpa 2 Box Office Collection: బాక్సాఫీసు రప్పా.. రప్పా – ‘పుష్ప 2’ ఫైనల్‌ కలెక్షన్స్‌ అవుట్, ఎన్ని కోట్లంటే!

Pushpa 2 Box Office Collection: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ల ‘పుష్ప 2’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులను సృష్టిస్తూ ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఇండియన్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండోవ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. మూవీ రిలీజై 30 రోజుల్లోనే రూ. 1831కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లు చేసింది.

ఫస్ట్‌ డే రూ. 294 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. అలా రోజు రోజు అదే జోరు చూపిస్తూ కేవలం వారంలో రోజుల్లోనే వెయ్యి కోట్ల క్రాస్‌ చేసింది. అలా వరుసగా కేజీయఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి 2 చిత్రాల రికార్డును కొల్లగొట్టిన పుష్ప 2, ఇక దంగల్‌ రికార్డును కూడా బ్రేక్‌ చేస్తుందనుకున్నారు. అయితే రూ. 1800 కోట్ల దగ్గరే ఉండిపోయింది. తాజాగా పుష్ప 2 ఫైనల్‌ కలెక్షన్స్‌ని (Pushpa 2 Final Collections) మూవీ టీం ప్రకటించింది. పుష్ప 2 రిలీజై రెండు నెలలు దాటేసింది.

ఈ సినిమా 75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ చేసినట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ వెల్లడించారు. ఈ మేరకు ఫైనల్‌ కలెక్షన్స్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేసింది. కాగా పుష్ప 2 వసూళ్లలో వరుస రికార్డుల బ్రేక్‌ చేసింది. విడుదలైన తక్కువ టైంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా పుష్ప 2పై పలు రికార్డ్స్‌ ఉన్నాయి. కేవలం 6 రోజుల్లోనే రూ. 1000 కోట్లు క్రాస్‌ చేసిన తొలి చిత్రం పుష్ప 2 రికార్డు నెలకొల్పింది.

ఇదిలా ఉంటే ఇండియన్‌ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దంగల్‌ (రూ. 2000కోట్లు)తో మొదటి స్థానంలో ఉంది. పుష్ప 2 రెండవ స్థానంలో వరకు బాహుబల్‌ 2 (రూ. 1810) మూవీ ఉండగా.. దానిని బ్రేక్‌ చేసి రెండోవ స్థానంలోకి పుష్ప 2 (రూ. 1857 కోట్లు) ఎగబాకింది. ప్రస్తుతం ఇండియన్‌ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండోవ చిత్రంగా పుష్ప 2 ఉంది. మూడో స్థానంలో బాహుబలి 2 ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌(రూ. 1387 కోట్లు), కేజీయఫ్‌ 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ. 1153 కో ట్లు), జవాన్‌ (రూ. 1148 కోట్లు) పఠాన్‌ (రూ. 1950) సినిమాలు ఉన్నాయి.