Last Updated:

Manchu Manoj: పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ – అర్దరాత్రి తిరుపతిలో హైడ్రామా

Manchu Manoj: పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ – అర్దరాత్రి తిరుపతిలో హైడ్రామా

Manchu Manoj in Police Custody: సినీ హీరో మంచు మనోజ్ పోలీసు కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆయన పోలీసు స్టేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ఏదోక వాగ్వాదం, గొడవతో మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కుతున్నాయి.

మోహన్‌ బాబు యూనివర్సిటీ వ్యవహరాల్లో మనోజ్‌ జోక్యం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మనోజ్‌ తిరుపతిలో ఉన్నాడు. అతడితో కొంతమంది బౌన్సర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి యూనివర్శిటీ వద్ద మనోజ్‌ ఏదైనా గొడవ చేస్తారనే ఉద్దేశంతో మోహన్‌ బాబు ముందుగానే మనోజ్‌ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోహన్‌ బాబు సమాచారంతోనే పోలీసులు మనోజ్‌ని కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మనోజ్‌ ఏపీలో ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా భాకారాపేట సమీపంలో ఉర్జా రిసార్టులో మనోజ్‌ బస చేస్తున్నాడు. పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లి మనోజ్‌ని ప్రశ్నించారు. ఇది దట్టమైన అటవీ ప్రాంతమని, ఇక్కడ సెలబ్రిటీలకు సేఫ్‌ కాదని సూచించారు. అటవీ ప్రాంతంలో ఎందుకు ఉంటున్నారని కూడా పోలీసులు మనోజ్‌ ప్రశ్నించారు. పోలీసుల తీరు తప్పుబట్టిన మనోజ్‌ వారితో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.

తాను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే తమకేంటి ఇబ్బంది అంటూ ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో మనోజ్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసుల స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా మనోజ్‌ ఆందోళన చేపట్టాడు. ‘నేను దొంగనా.. టెర్రరిస్ట్‌నా.. నన్నేందుకు అర్ధరాత్రి ప్రశ్నిస్తున్నారు? అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ పోలీసుల స్టేషన్‌ ఆవరణంలో హైడ్రామా చేశాడు. విషయం తెలిసి సీఐ ఇమ్రాన్‌ భాషా వచ్చి సర్థిచెప్పడంతో మనోజ్ ఆందోళన విరమించుకున్నాడు.