Telangana Bandh: రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్.. స్కూళ్లు, కాలేజీలకు ఎఫెక్ట్!
![Telangana Bandh: రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్.. స్కూళ్లు, కాలేజీలకు ఎఫెక్ట్!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/telangana-bandh.jpg)
Mala Mahanadu calls for Telangana bandh on Feb 14: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేపు బంద్ కొనసాగనుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేేకమని, నిర్ణయాలు తీసుకునే ముందే నేషనల్ ఎస్సీ కమిషన్ను సంప్రదించి ఉండాల్సిందని నాయకులు చెబుతున్నారు. అయితే ఈ వర్గీకరణను మాలమహానాడు సభ్యులతో పాటు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 14న బంద్కు పిలుపునిచ్చారు.
ఈ బంద్ ప్రభావంతో ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థలు, బ్యాంకులలు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు బంద్కు పిలుపునివ్వడంతో సీఎం రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, మాల మహానాడు నేతలతో పాటు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తారని సమాచారం.