Last Updated:

Virat Kohli: విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు.. అత్యధిక రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్!

Virat Kohli: విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు.. అత్యధిక రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్!

Virat Kohli becomes 1st Indian player to score 4000 runs vs England: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టుపై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఈ మైలురాయి దాటాడు. అయితే విరాట్ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ 3990 పరుగులతో ఉన్నారు.

ఇప్పటివరకు విరాట్ కోహ్లీ మొత్తంగా 545 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. 27వేల పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో 87 మ్యాచ్‌లు ఆడగా.. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ 8 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు చేయగా.. 41.23 సగటుతో ఉన్నాడు. ఇక, ఇంగ్లాండ్‌పై ఓవరాల్‌గా 4వేల పరుగులు మార్క్‌ను దాటిన ఆరో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డెకెక్కాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు డాన్ బ్రాడ్ మాన్ ఇంగ్లాండ్ జట్టుపై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5,028 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌పై 4,815 పరుగులు చేశాడు.