Medical Students Arrest: కేరళ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం – ప్రైవేట్ పార్ట్స్‌పై డంబెల్స్ పెట్టి.. కాంపాస్‌తో గుచ్చి..
![Medical Students Arrest: కేరళ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం – ప్రైవేట్ పార్ట్స్‌పై డంబెల్స్ పెట్టి.. కాంపాస్‌తో గుచ్చి..](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/medical-Students-Arrest.jpg)
5 Student Arrested For Brutal Ragging Juniors: క్రిమినల్ ర్యాగింగ్ కేసులో ఐదుగురు వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా జూనియర్లను క్రిమినల్ ర్యాగింగ్ పాల్పడిన ఘటన కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. జూనియర్ల ఫిర్యాదుతో ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు సీనియర్ల మెడికల్ విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసులో సెకండ్ ఇయర్ నర్సింగ్ స్టూడెంట్స్ సామ్యూల్ జాన్సన్, జీవా ఎన్ఎస్‌తో పాటు మూడవ సంవత్సరం చదువుతున్న రాహుల్ రాజ్, రిజిల్‌జిత్, వివేక్ ఎన్వీ దోషులుగా ఉన్నారు.
ర్యాంగింగ్ చట్టం కింద ఆ విద్యార్థులపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆ అయిదుగుర్ని కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. కాగా కొంతకాలంగా కాలేజీల్లో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదోకచోట విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే కేరళ మెడికల్ స్టూడెంట్స్ మాత్రం ర్యాగింగ్ పేరుతో అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కేరళ మెడికల్ కాలేజీ సీనియర్లు, జూనియర్లపై మూడు నెలలుగా క్రిమినల్ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.
పోలీసుల ప్రకారం.. ఫస్ట్ ఇయర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు సీనియర్లపై ఫిర్యాదు చేశారు. సీనియర్లు తమ దుస్తులు విప్పించి మర్మాంగాలపై డంబుల్స్ పెట్టేవారని జూనియర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో కంపాస్‌లతో గుచ్చి గాయాలపై లోషన్ పోసేవారని చెప్పారు. మద్యం తాగేందుకు సీనియర్లు తమ నుంచి రూ. 800 బలవంతంగా తీసుకున్నారని తెలిపారు. జూనియర్లను మద్యం తాగేలా వేధించి,ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడినట్టు జూనియర్ వైద్య విద్యార్థులు తమ ఫిర్యాదు పేర్కొన్నట్టు పోలీసు అధికారిక మీడియాకు వెల్లడించారు.