DSC Notification: గుడ్ న్యూస్.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
![DSC Notification: గుడ్ న్యూస్.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/2.webp)
AP Governement annousement Mega dsc notification to be released in march: డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మంగళవారం ఏపీ సీఎం దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూటమి సర్కారు కసరత్తు చేస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. అయితే డీఎస్సీ నియామక ప్రక్రియను మార్చిలో ప్రారంభించనున్నారు. అయితే త్వరగానే నియామకాలు చేపట్టి ఈ విద్యా సంవత్సరం వరకు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.