Last Updated:

Vishwak Sen: దయ చేసి నా సినిమాను చంపకండి – బాయికాట్‌ లైలా ట్రెండింగ్‌పై విశ్వక్‌ సేన్‌ ఆవేదన

Vishwak Sen: దయ చేసి నా సినిమాను చంపకండి – బాయికాట్‌ లైలా ట్రెండింగ్‌పై విశ్వక్‌ సేన్‌ ఆవేదన

Vishwak Sen Apologies to YSRCP Fans: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ లైలా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు బాయికాట్‌(#Boycottlila) సెగ తగలింది. రీసెంట్‌గా జరిగిన లైలా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫంక్షన్‌లో థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వివాదంగా మారాయి. దీంతో రాత్రిరాత్రే వేలల్లో బాయికాట్‌ లైలా పోస్ట్స్ పుట్టుకొచ్చాయి. అది చూసి మూవీ టీం షాక్‌ అయ్యింది. దీంతో విశ్వక్‌ సేన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తన సినిమాను చంపేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విశ్వక్‌ సేన్‌, నిర్మాత సాహు గారపాటి ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు.

ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ… “ఇది మాకు తెలియకుండా జరిగింది. ఆ సమయంలో మేము అక్కడ లేము. చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్లాము. మేము రాత్రి ఇంటికి వెళ్లాక ఈ విషయం గురించి తెలిసిందే. తెల్లారి లేచి చూసేసారికి బాయికాట్‌ లైలా అంటూ వేలల్లో ట్వీట్స్‌ పెట్టారు. ఎవరో సంబంధం లేని వాళ్లు చేసిన పనికి మేము బలి అవ్వాలా? సోషల్‌ మీడియాలో దారుణంగా పోస్ట్స్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉదయం లైలా హెచ్డీ లింకు పెడతా అనీ, వాడి ఖాతాలో మరొకడు బలి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు నేను ఎందుకు బలి కావాలి? దయ చేసి మా సినిమాను చంపకండి” అని కోరాడు.

అదే విధంగా ఈ కార్యక్రమంలో పొలిటికల్‌ కామెంట్స్‌ చేయడం తప్పు. ఆ సమయంలో మేము అక్కడ ఉండి ఉంటే స్టేజ్‌పైకి వెళ్లి మైక్‌ లాక్కునే వాళ్లం. ఈవెంట్‌ అయిపోయి డిన్నర్‌ చేసి ఇంటికి వెళ్లేవరకు మాకు ఆయన మాట్లాడిన విషయం తెలియదు. ఆ వ్యక్తి మాట్లాడిన వాటితో మాకు సంబంధం లేదు. ఇది నా ఈవెంట్‌లో జరిగినందువల్లే నేను వచ్చి క్షమాపణలు చెబుతున్నా. ఆయనతో మాట్లాడిన ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టే అంత టైం లేదు. మేము మూవీ ప్రమోషన్స్ చేసుకుని సినిమా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. దయ చేసి నా సినిమాను చంపేయకండి. లైలా సపోర్టు చేయండి మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా ఈవెంట్స్‌లో పాలిటిక్స్, నెంబర్స్‌ గురించి మాట్లాడం తప్పే. కానీ, ఇప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడి ఈ విషయాన్ని పెద్దగా చేయదలుచుకోలేదు. చాలా కష్టపడి సినిమా తీశాం. మా ప్రేమయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.