Last Updated:

Chuttamalle Song: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట ‘చుట్టమల్లే’ సాంగ్ – జూనియర్‌ ఎన్టీఆర్‌ రియాక్షన్‌!

Chuttamalle Song: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట ‘చుట్టమల్లే’ సాంగ్ – జూనియర్‌ ఎన్టీఆర్‌ రియాక్షన్‌!

Jr NTR reacted on ed sheeran chuttamalle Song: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ జరుగుతోంది. దేవర మూవీ మ్యూజిక్‌ పరంగా మంచి విజయం సాధించింది. ఇందులోని చుట్టమల్లే పాట ఫుల్‌ ట్రెండ్‌ అయ్యింది. ఈ పాటకు చిన్నవారి నుంచి పద్దవారికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇప్పటి ఈ పాట సోషల్‌ మీడియాలో మారుమోగుతూనే ఉంది.

ఇంటర్నేషనల్‌ పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌ సైతం చుట్టమల్లే పాట మెప్పించింది. తాజాగా ఓ కన్సర్ట్‌లో ఆయన ఈ పాట పాడి ఇక్కడ ఉన్నవారిలో జోష్‌ నింపారు. పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌కి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ ఆయన మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఆయన ఇండియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ కన్సర్ట్స్‌ నిర్వహిస్తూ ఇండియన్‌ ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. డిసెంబర్‌ 30న పూణేలో కన్సర్ట్‌ నిర్వహించిన ఆయన ఇటీవల ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీం సిటీలో, ఫిబ్రవరి 5న చెన్నైలో నిర్వహించారు.

రీసెంట్‌గా బెంగళూరు కన్సర్ట్‌ నిర్వహించి తన పాటలతో అలరించారు. సింగర్‌ శిల్పారావుతో కలిసి ఎడ్‌ షీరన్‌ పాటలు పాడారు. ఈ సందర్భంగా దేవర మూవీలోని చుట్టమల్లే పాటను పాడి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇంటర్నేషనల్‌ పాప్‌ సింగర్‌ నోట మన తెలుగు పాట రావడంతో అక్కడ ఉన్నవారంత సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఎడ్‌ షీరన్‌ ఈ పాట పాడటంతో ప్రస్తుతం చుట్టమల్లే సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు.

సంగీతానికి హద్దులు లేవు

“సంగీతానికి హద్దులు ఉండవు.  దీనిని మీరు మరోసారి రుజువు చేశారు. మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది” అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ సోలో హీరోగా వచ్చిన చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వంలో గతేడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. ఎన్టీఆర్‌ డ్యుయెల్‌ రోల్లో నటించి ఈ సినిమా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి: