Ari Movie: రిలీజ్‌కు ముందే సినిమా చూసే ఛాన్స్ – అనసూయ ‘అరి’ మూవీ వెరైటీ ప్రమోషన్స్
![Ari Movie: రిలీజ్‌కు ముందే సినిమా చూసే ఛాన్స్ – అనసూయ ‘అరి’ మూవీ వెరైటీ ప్రమోషన్స్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/ari-movie.jpg)
Watch Ari Move Before Release: ఈ మధ్య మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విభిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు. దీనినే అరి మూవీ టీం కూడా ఫాలో అవుతుంది. అందుకే తమ సినిమా ప్రమోషన్స్ వినూత్నం ప్లాన్ చేసింది. విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం కల్పిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు మూవీపై ప్రశంసలు కురిపించారు. అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని స్పెషల్ షో చూసిన వారంత రివ్యూ ఇచ్చారు. ఇక తమ చిత్రంపై ఉన్న నమ్మకంతో దర్శకుడు ప్రమోషన్స్ మరింత కొత్త ఆలోచించాడు. రిలీజ్‌కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది.
ఈ చిత్రాన్ని చూడాలనుకునేవారు నేరుగా దర్శకుడికే మెసేజ్ చేయొచ్చు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన పోస్టర్ డైరెక్టర్ వాట్సప్ నెంబర్‌తో పాటు QR కోడ్‌ని జోడించారు. వాట్సాప్ నెంబర్ లేదా QR కోడ్‌తో రిజిస్టర్ చేసుకుని ఈ సినిమా చూసే అవకాశాన్ని ఇచ్చారు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే రిజిస్టర్ చేసుకోండి. కాగా పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్న జయ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహిరించారు. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
View this post on Instagram
సైకో మైథాలజికల్ థ్రిల్లర్‌గా అరిని రూపొందించారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే ఆరు మనోభావాలను ఆధారంగా చేసుకుని, సమాజానికి ఓ బలమైన సందేశాన్ని అందించేందుకు ఈ సినిమా ప్రయత్నిస్తుంది. ఈ కాన్సెప్ట్ ప్రస్తుత తరం ప్రేక్షకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇప్పటికే ప్రత్యేక ప్రదర్శన చూసిన వారు పేర్కొన్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ మూవీపై అంచనాలు పెంచుతుంది. గర్వం అంటూ సాయి కుమార్ పోస్టర్, ఈర్ష్య అంటూ అనసూయ పోస్టర్ని, కామం అంటూ వైవా హర్ష పోస్టర్స్ రిలీజ్ చేసి వారి పాత్రలను పరిచయం చేశారు.