Palnadu Accident: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళలు స్పాట్ డెడ్

Road Accident in Palnadu dist: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి తిరిగి వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో మహిళలు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందులో ట్రాక్టర్ కిందపడిన నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో దాదాపు 20 మందికి పైగా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌పై తీసుకుళ్లినట్లు పలువురు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు.