Last Updated:

Manipur: బీజేపీ సీఎం రాజీనామా.. గవర్నర్‌కు రాజీనామా లేఖ

Manipur: బీజేపీ సీఎం రాజీనామా.. గవర్నర్‌కు రాజీనామా లేఖ

Manipur CM Biren Singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షాను కలిసిన అనంతరం మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్.. నేరుగా తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు.

ఇదిలా ఉండగా, అంతేకాకుండా రాష్ట్రంలో జాతుల మధ్య వైరంతో గత కొంతకాలంగా మణిపుర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో బీరెన్ సింగ్ పలుమార్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.  అయితే బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశిపెట్టినట్లు శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇంతలోనే ఆయనే రాజీనామా చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: