RGV:నువ్వు మాములోడివి కాదు వర్మ – ఒంగోలు పోలీసుల విచారణ అనంతరం ఆర్జీవీ షాకింగ్ పోస్ట్
![RGV:నువ్వు మాములోడివి కాదు వర్మ – ఒంగోలు పోలీసుల విచారణ అనంతరం ఆర్జీవీ షాకింగ్ పోస్ట్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/ram-gopal-varma.jpg)
Ram Gopal Varma post on Ongole Police: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ తన వ్యాఖ్యలతో వివాదంలో నిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే కాంట్రవర్సీలే ఆయనను ఫాలో అవుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. వర్మ ఏం మాట్లాడిన, ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం తన సోషల్ మీడియా పోస్ట్స్ వల్ల ఆర్జీవీని కోర్టు కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల వ్యక్తిత్వాన్ని కించరపరిచే విధంగా పోస్ట్‌లు పెట్టారు.
అయితే వీటిపై ఆభ్యంతరం తెలుపుతూ ఒంగోలు టీడీపీ నేత ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహరంలో ఏపీలోని పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆర్జీవీని ఒంగోలు పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. అయితే, ఇదే సమయంలో మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి ఆయనకు మరో నోటీసులు అందాయి. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇలా పోలీసులు కేసులు, విచారణలతో ఆర్జీవీ వరుసగా కోర్టుకు, పోలీసు స్టేషన్‌కు పరుగులు తీస్తున్నారు.
I LOVE ONGOLE 😍 AND I LOVE ONGOLE POLICE EVEN MORE😍😍. 3 CHEEERS 🍺🍺🍺 pic.twitter.com/vmjNW7ALdL
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2025
అయినప్పటికీ వర్మ మాత్రం తగ్గేదే లే అంటున్నాడు. తాజాగా పోలీసులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఒంగోలు పోలీసుల స్టేషన్ విచారణ పూర్తయిన అనంతరం వర్మ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. “ఐ లవ్ ఒంగోల్. అంతకంటే కూడా ఒంగోలు పోలీసులు అంటే మరింత ఇష్టం. 3 చీర్స్”అంటూ వోడ్క గ్లాస్‌తో ఉన్న ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన తీరుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నువ్వు మామూలోడివి కాదు.. వర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పోస్ట్ చూసి దీన్నే దెబ్బిపోడవడం అంటారు అంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ స్పందిస్తున్నారు.