Last Updated:

Tata Punch EV: టాటా లవర్స్‌కు గుడ్ న్యూస్.. పంచ్ ఈవీపై భారీ డిస్కౌంట్.. మిస్ చేయద్దు..!

Tata Punch EV: టాటా లవర్స్‌కు గుడ్ న్యూస్.. పంచ్ ఈవీపై భారీ డిస్కౌంట్.. మిస్ చేయద్దు..!

Tata Punch EV: భారతీయ కార్ల మార్కెట్లో కార్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మరోవైపు, కార్లపై డిస్కౌంట్లు అమ్మకాలను పెంచుతూనే ఉన్నాయి. మారుతీ సుజుకి నుండి టాటా మోటార్స్ వరకు కార్లపై చాలా మంచి తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు, మీరు ఈ నెలలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. టాటా ఫిబ్రవరి 2025లో తన ఎలక్ట్రిక్ కారు పంచ్ EVపై రూ.70,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాహనం ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Tata Punch EV Offers
టాటా మోటార్స్ MY2024 మోడల్ పంచ్ EVపై గరిష్టంగా 70,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది, అయితే MY2025 మోడల్‌కు 40,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. తగ్గింపు గురించి మరింత సమాచారం కోసం, కస్టమర్‌లు వారి సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

Tata Punch EV Price
టాటా పంచ్ EV ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 9.99 లక్షల నుండి రూ. 14.29 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 2 బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది. వీటి రేంజ్ వరుసాగా 315 కిమీ, 421 కిమీ. ఎస్‌యూవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.

భద్రత కోసం కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ EV  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 9.99 లక్షల నుండి రూ. 14.29 లక్షల వరకు ఉంటుంది.