Shekar Basha: బిగ్బాస్ శేఖర్ బాషాపై మరో కేసు – అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ శ్రేష్టివర్మ..
Shrasti Verma Filed Cas on Shekar Basha: బిగ్బాస్ ఫేం, ఆర్జే శేఖర్ భాషాపై తాజాగా మరో కేసు నమోదైంది. కాగా హీరో రాజ్ తరుణ్, అతడి ప్రియురాలు లావణ్య కేసులో శేఖర్ బాషా పేరు మారుమోగింది. యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్య్వూ ఇస్తూ లావణ్యపై తరచూ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచేశాడు. తాజాగా మస్తాన్ సాయి కేసులో శేఖర్ భాషా పేరు వినిపిస్తోంది. డ్రగ్స్ కేసులో అక్రమంగా తనని ఇరికించాలని చూశాడని ఆరోపిస్తూ లావణ్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను పోలీసులకు అందజేసింది. దీంతో శేఖర్ బాషాపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా తాజాగా అతడిపై మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలైన మహిళా కొరియోగ్రాఫర్ శేఖర్ బాషాపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈ క్రమంలో శ్రేష్టి వర్మ శేఖర్ భాషాలో ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా కాల్ రికార్డు లీక్ చేశాడని శ్రేష్టి వర్మ తన ఫిర్యాదులో పేర్కొంది.
అలాగే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తన పరువు భంగం కలిగేలా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశ పూర్వకంగా, దురుద్దేశంతోనే అతడు తన ప్రైవేట్ కాల్ రికార్డ్ లు లీక్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తోపాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లను సీజ్ చేయాలని ఆమె పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు శేఖర్ బాషాపై BNS యాక్ట్ సెక్షన్ కింద 79,67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు.