Vizag Railway Zone: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ!
Center has issued orders railway zone centered as visakhapatnam: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, శాఖ కేంద్రంగా ఏర్పాటైనా దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిని 410 కి.మీగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖగా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న ఏపీ రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు మార్చగా.. విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్ పాడ్ రూట్లను సికింద్రాబాద్‌కు మార్చింది. ఈ జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి.
రైల్వే శాఖ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఎంపీ శ్రీభరద్ పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన మరో విజయమని వెల్లడించారు. విశాఱ రైల్వే అభివృద్ధిలో చరిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు. వాల్తేరును విశాఖ రైల్వే అభివృద్ధిలో పునర్మామకరణం చేయడం హర్షణీమని శ్రీభరత్ పేర్కొన్నారు.