CM Jagan: సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్
సీఎం జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది.
YSRCP: సీఎం జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక, నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది. ఈ మేరకు వైసీపీ జనరల్ సెక్రటరీకి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్రెడ్డిని ఎన్నుకున్నారు. ఈమేరకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు. ఈ వ్యవహారంలో పార్టీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని, వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు పంపారు.