Last Updated:

Best 5G Smartphones Under 20000: అదరహో అదరహా.. రూ.20 వేల లోపే దుమ్ములేపే ఫోన్లు.. కెమెరాలు ఏమున్నయ్‌రా..!

Best 5G Smartphones Under 20000: అదరహో అదరహా.. రూ.20 వేల లోపే దుమ్ములేపే ఫోన్లు.. కెమెరాలు ఏమున్నయ్‌రా..!

Best 5G Smartphones Under 20000: ఇండియన్ టెక్ మార్కెట్లోకి కంపెనీలు ప్రతిరోజూ సరికొత్త గ్యాడ్జెట్లను తీసుకొస్తున్నాయి. వీటిలో ప్రీమియం, మిడ్‌రేంజ్,  బడ్జెట్ ఫోన్‌లతో సహా వివిధ సెగ్మెంట్‌లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా రూ.20 వేల కంటే తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందించే ఫోన్ల కోసం చూస్తుంటే.. అటువంటి 4 గ్యాడ్జెట్లను తీసుకొచ్చాము. అయితే ఈ ఫోన్లు 5జీ నెట్వర్క్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లలో అద్భుతమైన కెమెరాలు ఉంటాయి.

iQOO Z7 5G
గేమింగ్, వేగవంతమైన పర్ఫామెన్స్‌తో కూడిన ఈ ఫోన్ ధర రూ.18,999. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో  6.38-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో కంపెనీ OISతో 64MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను అందించింది. ఇది కాకుండా, ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫోన్‌లో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీ ఉంది.

Samsung Galaxy M14 5G
మంచి బ్యాటరీ లైఫ్ కోసం సామ్‌సంగ్ గెలాక్సీ  M14 5G బెస్ట్ ఆప్షన్. ఫోెన్ ధర గురించి చెప్పాలంటే.. ఈ ఫోన్‌ను రూ. 18,499కి ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే ఫోన్‌లో Exynos 1330 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి, అలానే ఫోన్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉంది.

Realme Narzo 55 5G
ఈ జాబితాలో మూడవ ఫోన్ Realme Narzo 55 5G. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999. ఈ ఫోన్‌లో 6.72-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే.. ఇందులో MediaTek Dimensity 810 ప్రాసెసర్ ఉంది. అలానే డ్యూయల్ కెమెరా సెటప్‌ కూడా ఉంది. అలానే 64MP ప్రైమరీ కెమెరా,  2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Poco X4 Pro 5G
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా ఉంది. అందులో 64MP + 8MP + 2MP సెటప్ ఇచ్చారు.  67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ కూడా ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఫోన్ కావాలంటే, X4 ప్రో 5G మంచి ఆప్షన్. ఈ ఫోన్ ధర రూ.19,499.