Last Updated:

Flight Crash Incident: వణికించిన మరో విమానం.. టేకాఫ్ అవుతుండగా చెలరేగిన మంటలు !

Flight Crash Incident: వణికించిన మరో విమానం.. టేకాఫ్ అవుతుండగా చెలరేగిన మంటలు !

A United Airlines Flight from Houston to New York Crash Incident viral video: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవతుండగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. హ్యుస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం జార్జిబుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. ఎమర్జెనీ విండో ఓపెన్ చేయగా.. ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

అనంతరం ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పంది. విమానంలోని ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాద సయంలో విమానంలో 104 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. అనంతరం ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానాన్ని కేటాయించారు. ఈ విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరింది.

ఇదిలా ఉండగా, టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగిన దృశ్యాలను అందులో కూర్చున్న ప్రయాణికురాలు వీడియో తీసుంది. ఈ వీడియోలను సోసల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, అమెరికాలో రెండు విమానాలు కూలి పది రోజులు కాకముందే మరో విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు జంకుతున్నారు. వాషింగ్టన్ డీసీలోహెలికాప్టర్, అమెరికా ఎయిర్ లైన్స్ రెండు ఢీకొట్టడంతో 67 మంది ప్రాణాలు కోల్పోయారు.