Last Updated:

Jonty Rhodes: విజయవాడలో జాంటీ రోడ్స్‌.. ఏపీ బీఎన్‌ఐ ఆధ్వర్యంలో మెగా కాంక్లేవ్‌ 3.0

Jonty Rhodes: విజయవాడలో జాంటీ రోడ్స్‌.. ఏపీ బీఎన్‌ఐ ఆధ్వర్యంలో మెగా కాంక్లేవ్‌ 3.0

South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్‌ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రణాళికలు ఉండాలి..
ఏ రంగంలో అయినా రాణించాలంటే.. మనపై మనకు నమ్మకం ఉండాలన్నారు. ఆ తర్వాత కష్టంతోపాటు, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఏ వ్యాపారమైనా వినియోగదారుల్లో నమ్మకం కలిగించాలని, దానిని నిరంతరం కొనసాగిస్తే ఇక తిరుగుండదన్నారు. తాను క్రికెటర్ అవుదామని నిర్ణయం తీసుకుని అడుగులు వేసే సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడ్డానని చెప్పారు. చేసే పనిపైన శ్రద్ధ, లక్ష్యాలు సాధించాలనే తపన ఉండాలని వివరించారు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, వాటిని తట్టుకుని నిలబడాలని.. లోపాలు సరి చేసుకుంటూ ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని వ్యాపారవేత్తల్లో ఉత్తేజాన్ని నింపారు.