Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన.. రూ.2,500 కోట్ల వ్యయంతో కొత్త భవనం!
Telangana CM Revanth Reddy lays foundation stone for : హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టే ఈ ఆస్పత్రిలో 30 డిపార్ట్మెంట్లు ఉండనున్నాయని, ఇందులో రోబోటిక్ సర్జరీలు చేసేలా నిర్మించనున్నారు. మొత్తం 8 బ్లాక్లు, 2వేల పడకలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తుండగా.. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్పొరేట్ ఆస్పత్రులను తలపించేలా నిర్మించనున్నారు.
26.30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఆస్పత్రిలో ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ ఉండేలా ప్లాన్ చేశారు. రూ.2,500 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ప్రతి రోజు 5వేల మంది ఓపీ రోగులకు సేవలు అందించనున్నారు. ఇందులో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉండనున్నాయని, వరల్డ్ క్లాస్ వసతులతో ఆస్పత్రిని నిర్మించనున్నారు.
కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిలో 2వేల బెడ్స్ అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సైతం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతి రోజూ 5వేల మంది రోగులకు ఓపీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఆస్పత్రి గ్రౌండ్ ఫోర్లో అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలకు సంబంధించి ల్యాబ్లు ఏర్పాటు చేస్తుండగా.. ఆస్పత్రి ఆవరణలో స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ప్లాన్ చేశారు.