Last Updated:

Guillain Barre Syndrome: బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మరో వ్యాధి.. తెలంగాణలో తొలి కేసు నమోదు!

Guillain Barre Syndrome: బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మరో వ్యాధి.. తెలంగాణలో తొలి కేసు నమోదు!

Guillain Barre Syndrome first case Reported in Hyderabad: మహారాష్ట్రలో విజృంభిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ తెలంగాణకు వ్యాపించింది. తాజాగా, హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు జీబీఎస్ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆమెకు జేబీఎస్ సంబంధించిన లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే, ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ జీబీఎస్.. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధన శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేది అంటువ్యాధి కాదని, నయం చేయవచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా నరాలపై దాడి చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే.. ఒళ్లంతా తిమ్మిడి అనిపిస్తుందన్నారు. కండరాలు బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ప్రధానంగా కలుషిత ఆహారంతో పాటు నీటి ద్వారా ఈ వైరల్ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ వైరల్ బ్యాక్టీరియాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, చికిత్సతో నయం చేసుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.