Last Updated:

Kohli’s Ranji Trophy: 13ఏళ్ల తర్వాత కోహ్లీ రీఎంట్రీ.. కిక్కిరిసిన స్టేడియం.. టాస్ గెలిచిన కోహ్లీ జట్టు!

Kohli’s Ranji Trophy: 13ఏళ్ల తర్వాత కోహ్లీ రీఎంట్రీ.. కిక్కిరిసిన స్టేడియం.. టాస్ గెలిచిన కోహ్లీ జట్టు!

Kohli’s Ranji Trophy return sparks chaos outside Arun Jaitley Stadium: రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్‌లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుండగా.. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ తీసుకుంది. కాగా, ఢిల్లీ జట్టుకు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌ చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు.

మరోవైపు, విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో రంజీ మ్యాచ్ ‌పై క్రేజీ నెలకొంది. ఈ మేరకు అరుణ్ జైట్లీ స్టేడియానికి వేలాది మంది ఫ్యాన్స్ పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. స్టేడియం బయట దాదాపు 2కి.మీల మేర క్యూలో ఫ్యాన్స్ నిల్చున్నారు. మ్యాచ్‌లో కోహ్లీకి ఓ ప్రత్యేకత ఉంటుందని మరోసారి గుర్తు చేసింది.

ఇదిలా ఉండగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. రంజీ మ్యాచ్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో గేటు నంబర్ 16 వద్ద పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. కాగా, ప్రేక్షకుల వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందులో ఓ పోలీస్ అధికారి బైక్ కూడా ధ్వంసమైంది. అంతర్జాతీయ మ్యాచ్‌కు కూడా లేనంతలా కోహ్లీ కోసం ఫ్యాన్స్ స్టేడియాన్ని పోటెత్తారు.

అయితే, విరాట్ కోహ్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ సమయంలో కోహ్లీ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. వికెట్లు తీస్తున్న బౌలర్లను అభినందించడంతో వారిలో ధైర్యాన్ని నింపాడు. కాగా, మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. వెంటనే విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించాడు. దీంతో కోహ్లీ అలా చేయవద్దని చెప్పాడు. గ్రౌండ్ సెక్యూరిటీ వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లారు.