Fatima Sana Shaikh: తెలుగు నిర్మాత నాతో అనుచితంగా ప్రవర్తించారు – కాస్టింగ్ కౌచ్‌పై ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా షాకింగ్ కామెంట్స్
Fatima Sana Open Up on Casting Couch: ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌తో డేటింగ్ వార్తలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. కెరీర్ ప్రారంభంలో ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పింది. అయితే అది బాలీవుడ్ కాదు సౌత్ సినిమాల్లో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఓ నేషనల్ చానల్‌కు ఇచ్చిన ఇంంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ” ఒకప్పుడు బాలీవుడ్లో సినిమా అవకాశాలకు సౌత్ సినిమాలు తొలి అడుగుగా ఉండేవి.
సౌత్ మంచి సినిమాలు చేస్తే హిందీలోనూ గుర్తింపు వస్తుంది. అలా నేను తెలుగులో ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ సినిమా చేశాను. ఇదే నా మొదటి చిత్రం. దీని తర్వాత ఓ తెలుగు నిర్మాతను కలిశాను. ఆయన ‘ఆఫర్స్ కావాలంటే ఇక్కడ మేము ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏం చేయడానికి అయినా అంగీకరించాలి’ అన్నారు. సినిమా వరకు ఏం అవసరమో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను. దాంతో ఆయన ఒపెన్‌గా కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు. తాను ఎవరి దగ్గరకు వెళ్లమంటే అక్కడికి వెళ్లాలని అనుచితంగా మాట్లాడారు.
ఆయన మాటాలకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. దీంతో అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాను. అలా కాస్టింగ్ కౌచ్ వల్ల సినిమా ఎన్నో సినిమా ఆఫర్స్ వదుకోవాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కొత్త వచ్చిన నటీనటులను కమిషన్ పేరుతో కాస్టింగ్ డైరెక్టర్స్ మోసం చేసేవారంది. కాస్టింగ్ డైరెక్టర్స్ కమిషన్ పేరుతో డబ్బులు తీసుకునేవారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కష్టపడి నటిస్తున్న నటులను కమిషన్ పేరుతో మోసం చేసేవారు, ఆడిషన్ పూర్తయ్యాక మా దగ్గర 15 శాతం కమిషన్ తీసుకున్నాకే పేమేంట్స్ ఇచ్చేశారు. అయితే ఇండస్ట్రీలో అందరు అలా ఉండరని, చెడ్డ వారితో పాటు మంచి వారు కూడా ఉన్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.