Last Updated:

Cyber Crime sin AP: రాష్ట్రంలో పెరిగిన సైబర్ క్రైమ్.. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్!

Cyber Crime sin AP: రాష్ట్రంలో పెరిగిన సైబర్ క్రైమ్.. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్!

DGP tirumala rao on increasing Cyber Crime In AP: రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతోంది. అయితే ఇతర నేరాలు తగ్గుతుండగా.. సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ మేరకు శ్రీకాకుళంలో జరగిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సైబర్ క్రైమ్ అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సైబర్ క్రైమ్‌ను నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను పెట్టేందుకు ప్లాన్ చేసినట్లు వివరించారు. ప్రధానంగా నిపుణులను ఉపయోగించుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానం ఉన్నట్లు తెలిస్తే అలర్ట్‌గా ఉండాలన్నారు. కొంతమంది ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారని, ఇలా ఎవరైనా ఫోన్ చేస్తే నగదు చెల్లంచవద్దని సూచించారు.

సైబర్ క్రైమ్ నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమన్నారు. అంతేకాకుండా చిన్న పిల్లలతోపాటు , వృద్ధులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. సమాజంలో ఎటువెళ్తేందో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. అలాగే రాస్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రత్యక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి గంజాయిని అరికడుతోందన్నారు.