AP BJP New President: మరో వారంలో ప్రకటన వచ్చే అవకాశం.. ఏపీ బీజేపీ చీఫ్ ఎవరో?

AP BJP New President An announcement is likely to come in the next week: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి నూతన అధ్యక్షుడిని నియమించేందుకు ఆ పార్టీ కేంద్రం పెద్దలు కసరత్తు ఆరంభించారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి 2023 జూలైలో బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక జరగాలి. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని నియమించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీలో జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తి కావడంతో, ఇక.. రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై వారు గట్టి కసరత్తు చేస్తున్నారు.
పార్టీ విస్తరణపై ఫోకస్
ఏపీలోని కూటమి సర్కారులో భాగస్వామిగా ఉన్న బీజేపీ కొత్త అడుగులు వేస్తోంది. కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలో ఏపీకి భారీగా సాయం అందుతోంది. దీంతో, ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. తాజాగా అమిత్ షా విజయవాడ పర్యటన సమయంలో పార్టీ నేతలకు అమిత్ షా తమ వ్యూహం స్పష్టం చేసారు. పార్టీ బలోపేతం పైనే నేతలంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో బీజేపీ సంస్థాగత బలోపేతం పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేసారు. ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది.
పోటీలో పలువురు నేతలు
ఈ పదవి కోసం దాదాపు పదిమంది పోటీ పడుతున్నారు. పోటీ పడుతున్న వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి పివిఎన్ మాధవ్, కోస్తా నుంచి పాకా సత్యనారాయణ వంటి నేతలను పరిగణలోకి తీసుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పదవి కోసం దాదాపు పదిమంది పోటీ పడుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పేరును పురుగు రాష్ట్రానికి చెందిన ఒక కేంద్రమంత్రి సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్త ముఖానికి చాన్స్?
కాగా, ఈ మేరకు బీజేపీ పెద్దలు ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా సీనియర్ కార్యకర్త శ్రీనివాస వర్మకు అవకాశం ఇచ్చిన విధంగానే ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలోనూ పార్టీకి సుదీర్ఘ కాలం పని చేసిన సాధారణ కార్యకర్తకు పార్టీ నాయకత్వం అప్పగిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏబీవీపీ, బీజేపీ యువమోర్చాలో పని చేసి… బీజేపీలో పని చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీసీ నాయకుడి పేరు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.