CM Chandrababu: కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ!
AP CM Chandrababu Naidu Meets Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్‌లోని ఫైనాన్సియల్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీ 45 నిమిషాల పాటు కొనసాగింది.
ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. ప్రధానంగా అమరావతి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలను నిర్మాలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీన సెంట్రల్ గవర్న్ మెంట్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అలాగే కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషీలను చంద్రబాబు కలవనున్నారు.