Kishan Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి.. త్వరలో 5 లక్షల ఉద్యోగాలు
Union Minister Kishan Reddy says Coal sector will create 5 lakh jobs: రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రెండు బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అభిప్రాయపడ్డారు.
2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76 శాతం పెరిగిందన్నారు. 2040 నాటికి గరిష్ట స్థాయికి బొగ్గు డిమాండ్ ఉంటుందని తెలిపారు. నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు కిషన్‌రెడ్డి సూచనలు చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల మూడో జాతీయ సదస్సులో కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.