Last Updated:

Mohd Shami: ఫుల్ ఫామ్‌లో టీమిండియా పేసర్.. ‘షమీ ఈజ్ బ్యాక్’ అంటూ బీసీసీఐ స్పెషల్ వీడియో

Mohd Shami: ఫుల్ ఫామ్‌లో టీమిండియా పేసర్.. ‘షమీ ఈజ్ బ్యాక్’ అంటూ బీసీసీఐ స్పెషల్ వీడియో

Indian pacer Mohd Shami makes comeback after Long Time: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో చేరాడు. దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంతకుముందు 2023 వ‌న్డే ప్రపంచ కప్‌లో షమీ గాయ‌ప‌డి టీమిండియా జట్టుకు దూరమయ్యాడు. ఆ త‌ర్వాత శస్త్రచికిత్స చేయించుకొని సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జట్టులో చేరాడు.

ఇంగ్లండ్‌తో ఈనెల 22వ తేదీ నుంచి జరిగే టీ20 సిరీస్‌లో షమీ ఆడనున్నాడు. ఇందులో భాగంగానే ఈడెన్ గార్డెన్స్‌లో మహ్మద్ షమీ సహచర ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. అనంతరం అభిమానులకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘షమీ ఈజ్ బ్యాక్’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

కాగా, ప్రస్తుతం బుమ్రా గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అభిమానుల దృష్టంతా షమీపైనే పడింది. బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ నేతృత్వంలో షమీ సాధన చేశాడు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, ధ్రువ్‌ జురెల్‌ లాంటి యువ కుర్రాళ్లకు బౌలింగ్ వేస్తూ ఫుల్ ఫామ్‌లో కనిపించాడు.