Last Updated:

Wankhede Stadium: సచిన్ పాటకు స్టెప్పులు వేసిన సునీల్ గవాస్కర్

Wankhede Stadium: సచిన్ పాటకు స్టెప్పులు వేసిన సునీల్ గవాస్కర్

Sunil Gavaskar and Sachin dance in Wankhede Stadium in Mumbai: ముంబైలోని వాంఖడే స్టేడియం జూబ్లీ వేడుకల్లో ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సరికొత్త అవతారం ఎత్తారు. ఒకరు పాటలు పాడగా.. మరొకరు స్టెప్పులు వేసి అలరించారు. సునీల్ గవాస్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యాఖ్యాత అవతారం ఎత్తగా.. సచిన్ తనకు మొదటి నుంచి అలవాటైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. క్రమశిక్షణను కొనసాగిస్తున్నారు.

తాజాగా, వీరిద్దరూ ప్రేక్షకులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. వాంఖడే మైదానం 50 ఏళ్ల వేడుకలకు రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రహానే, శ్రేయస్ అయ్యర్ తదితర ఆటగాళ్లు హాజరయ్యారు. ఇందులో భాగంగానే షారుఖ్ ఖాన్ మూవీలోని ‘ఓం శాంతి ఓం’ పాటకు సునీల్ గవాస్కర్ స్టెప్పులు వేశారు. సచిన్ ఆ పాటను పాడుతూ అత్యంత ఉత్సాహంగా కనిపించారు.