Last Updated:

Hyderabad Student Dies in USA: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. తెలుగు యువకుడి మృతి

Hyderabad Student Dies in USA: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. తెలుగు యువకుడి మృతి

Gun Fire in USA Hyderabad Student Died: అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ యువకుడిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు చేశాడు. ఈ కాల్పుల్లో చైతన్యపురికి చెందిన రవితేజ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే ఉన్నత చదువుల కోసం రవితేజ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు అతని బంధువులు చెబుతున్నారు. అయితే 2022లో అమెరికా వెళ్లిన రవితేజ.. ఇటీవల మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

కాగా, హైదరాబాద్‌ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొయ్యాడ రవితేజ తండ్రి కొయ్యాడ చంద్రమౌళికి చైతన్యపురిలో మంచి పేరు ఉందని, తన కుమారుడు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతాడు అనుకునే తరుణంలో ఇలాంటి వార్త రావడం అందరినీ కలిచివేసిందని స్థానికులు విలపిస్తున్నారు. అయితే వాషింగ్టన్‌లో కొంతమంది దుండగులు కాల్పులు జరపగా.. ఈ ఘటనలో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు.