Anil Ravipudi: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌పై అప్డేట్ – సినిమా ఎలా ఉంటుందో చెప్పిన అనిల్ రావిపూడి
Anil Ravipudi About Sankranthiki Vasthunam Sequel: ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు అనిల్ రావిపూడి, వెంకటేష్. జవనరి 14న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజులకే థియేటర్ల సంఖ్యను పెంచుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ. 161 పైగా కోట్లు గ్రాస్ నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. గేమ్ ఛేంజర్ వచ్చిన లాస్‌ని సంక్రాంతికి వస్తున్నాం కాస్తా పూడ్చింది.
దీంతో మేకర్స్ కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. ఇక వెంకటేస్ కెరీర్లోనే హయ్యేస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని సినిమా చూస్తే అంచనాలు వచ్చాయి. అయితే అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టం చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మూవీ సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీంతో ఇంటర్య్వూ చేసింది యాంకర్ సుమ. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మూవీకి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశాడు. “సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ ఉంటుందని, ఇదే కాన్సెప్ట్‌తో సినిమా ఉండే అవకాశం ఉందన్నారు. సీక్వెల్‌కి కూడా ఇదే టైటిల్ ఉండోచ్చా? అని సుమ అడగ్గా.. అది అనిల్ చేతుల్లోనే ఉందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. దీంతో అనిల్ రావిపూడి కల్పించుకుని అది సీక్వెల్లోనే తెలుస్తుందన్నారు. ఇక సినిమా కూడా వచ్చే సంక్రాంతికి వస్తుందంటూ హైప్ ఇచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నారు. ఎందుకంటే ఈ కాన్పెప్ట్ బాగా వర్కౌట్ అయ్యిందని, దీన్నే మరో పరిస్థితుల్లో సినిమా చెయొచ్చన్నారు. కాబట్టి ఈ సినిమా సీక్వెల్ చేసే ప్లాన్ ఉందని, ఫస్ట్ పార్ట్ రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి సీక్వెల్ అక్కడి నుంచే ప్రారంభించి మరో అద్భుతం చేయొచ్చు అంటూ సీక్వెల్‌పై హైప్ ఇచ్చారు. కాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ టీం ఇంతవరకు స్పష్టం చేయలేదు. కానీ మూవీ ఎండింగ్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కామెంట్స్‌తో అది స్పష్టం అయ్యింది. ఇక నెక్ట్స్ ఇయర్ కూడా వెంకీమామకు బ్లాక్‌బస్టర్ పొంగల్ అవ్వాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.