Last Updated:

Dhanush: ధనుష్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ – కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Dhanush: ధనుష్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ – కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Dhanush Neek Movie Release Postponed: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ డ్రామా తెరకెక్కుతున్న సంగత తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగులో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్య ధనుష్‌ నటనతో పాటు దర్శకత్వంపై ఫోకస్‌ పెడుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన రాయన్‌ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

దీంతో ధనుష్‌ దర్శకత్వంపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో సినిమాలు వచ్చాయి. తాజాగా యువనటీనటులతో ఆయన ఓ రొమాంటిక్‌ డ్రామాగా నీక్‌(‘నిలవకు ఎన్మేల్‌ ఎన్నాడి కోబం’) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. యంగ్‌ సెన్సేషన్స్‌ అనిఖ సురేంద్రన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, మథ్యూ థామస్‌, వెంకటేష్‌ మీనన్‌ వంటి యువ నటీనటులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

పైగా ధనుష్‌ దర్శకత్వంలో వస్తుండటంతో మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గొల్డెన్‌ స్పారో సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో నీక్‌ చిత్రంపై తమిళంలో మంచి బజ్‌ నెలకొంది. ఈ ఏడాది ఫబ్రవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నీక్‌ విడుదల వాయిదా పడింది.

ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం వెల్లడించింది. కోలీవుడ్‌లో ఇటీవల వచ్చిన మార్పుల వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌పై హీరో ధనుష్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరిరాజా సమర్పణలో ఉండర్‌బార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: