Manchu Manoj: మంచు వారసుల ట్వీట్ వార్ – కన్నప్ప పోస్టర్‌తో విష్ణుకి మనోజ్ కౌంటర్, ఏమన్నాడంటే..
Manchu Manoj Counter to Vishnu: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం అందరికి అర్థమైపోయింది. మంచు మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులు స్టేషన్ వరకు వెళ్లారు. అయితే ఈ వివాదంలో ఇప్పటి వరకు విష్ణు పేరు పరోక్షంగానే వినిపించింది. ఇన్‌డైరెక్ట్‌గా అన్నదమ్ముళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అయితే ఇప్పుడు వీరి వివాదం సోషల్ మీడియాకు ఎక్కింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ట్విట్స్ చేసుకుంటారు.
ట్విటర్ వేదికగా మంచు వారసులు డైలాగ్స్‌తో దాడికి దిగారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కొన్ని గంటల క్రితం మంచు విష్ణు రౌడీ సినిమాలోని ఓ డైలాగ్ షేర్ చేయగా.. దానికి కౌంటర్‌గా తాజా మనోజ్ ఓ ట్వీట్ వదిలాడు. సింహలా గర్జించాలని ప్రతి కుక్కకి ఉంటుందని రౌడీ సినిమాలోని తన తండ్రి డైలాగ్‌ని విష్ణు షేర్ చేస్తూ తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. అయితే అది మనోజ్‌ని ఉద్దేశించినట్టు ఉందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు. అన్న వేసిన ట్వీట్‌కి మనోజ్ తాజాగా కౌంటర్‌గా కృష్ణం రాజు కన్నప్ప సినిమాను వాడుకున్నాడు.
#Kannapa lo #RebelStar Krishnam raju garu laga, Simham avalli ani prathi fraud kukkaki vuntudhi,e vishyam nuvu idhe janamlo telusukuntav. #VisMith (crack this guys)
Clue (his Hollywood venture) pic.twitter.com/iJXIdEx59y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025
రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమాలోని పోస్టర్స్ షేర్ చేస్తూ.. “కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అని పోస్ట్ చేశాడు. అంతేకాదు విస్మిత్(#Vismith)అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసి క్రాక్ దిస్ గాయ్ అని పేర్కొన్నాడు. అంతేకాదు తన తండ్రి మోహన్ బాబు సినిమాలోని ఓ సినిమా డైలాగ్‌ని కూడా షేర్ చేశాడు. ఆస్తి సంబంధించిన ఓ డైలాగ్ కావడంతో ఇది తన అన్నయ్య విష్ణును ఉద్దేశించే చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు.. “సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావని ఆశ” అని రౌడీ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్‌ని షేర్ చేశాడు. దీనికి కౌంటర్‌గా మనోజ్ తాజాగా ట్వీట్ చేసిశాడని నెటిజన్లు సందేహిస్తున్నారు.
#VisMith (crack this guys)
Clue (his Hollywood venture) pic.twitter.com/UpNougHLJT— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025