Last Updated:

Hero Xtreme 250R Launch: ఆరంభం అరాచకం.. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్.. చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు..!

Hero Xtreme 250R Launch: ఆరంభం అరాచకం.. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్.. చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు..!

Hero Xtreme 250R Launch: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్‌ను 2025 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. హీరో కొత్త ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్ ధర రూ.1.80 లక్షల ఎక్స్‌షోరూమ్. 250సీసీ బైకులు భారత మార్కెట్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్. బ్రాండ్లు ఇప్పుడు ప్రీమియం బైక్‌ల ట్రెండ్‌లో చిక్కుకున్నాయి. ఈ విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని హీరో మోటోకార్ప్ సంచలనం సృష్టించడానికి కొత్త బైక్ విడుదల చేసింది.

హీరో కంపెనీ ఇప్పుడు ఈ 250సీసీ సెగ్మెంట్ ఎక్స్‌ట్రీమ్ 250ఆర్‌ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్‌ను ఇటీవల ఇటలీలోని మిలన్‌లో జరిగిన 2024 EICMA షోలో ప్రదర్శించారు. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ మోడల్‌లో ఫ్రంట్ కౌల్, ఆటో-ఇల్యూమినేషన్ క్లాస్-D ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు, ఎలిజెంట్ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి.

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్ స్పోర్టీ గ్రాఫిక్స్ రెడ్, బ్లాక్, వైట్ కలర్స్ అద్భుతమైన మిక్స్. ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్ ఫ్రంట్ ఫెండర్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ స్ప్రింగ్‌కి కూడా రెడ్ కలర్ ఇచ్చారు. కంపెనీ ఇంధన ట్యాంక్‌పై 3డి ఫార్మాట్‌లో ‘ఎక్స్‌ట్రీమ్’ బ్యాడ్జింగ్‌ను కూడా ఇచ్చింది.

సైడ్ రేడియేటర్ కవర్లపై కూడా R అక్షరాన్ని చూడవచ్చు. అంతేకాకుండా, ఈ కొత్త హీరో బైక్ స్పీడ్ సీట్ల కోసం సొగసైన ప్రొఫైల్‌ను కూడా అందించింది. ఇది బైక్ స్పోర్టీ లుక్, ఫీల్ రాజీ పడకుండా చూసుకుంటుంది. విలక్షణమైన మెటాలిక్ కాపర్ ఫినిషింగ్‌లో ఇంజన్ కేసింగ్ ఉండటం మరో హైలైట్.

విలక్షణమైన మెటాలిక్ కాపర్ ఫినిషింగ్‌లో ఇంజన్ కేసింగ్ ఉండటం మరో హైలైట్. ఓవరాల్‌గా హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్ స్పోర్టీ డిజైన్, గోల్డెన్ ఫినిషింగ్ USD ఫోర్క్స్, స్పోర్టీ గ్రాఫిక్స్ బ్రాండ్‌ను గర్వించేలా చేస్తాయి. ఇది హీరో మోటోకార్ప్ మొదటి 250సీసీ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్.

మొత్తంమీద హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్‌లో స్పోర్టీ డిజైన్, గోల్డెన్ ఫినిషింగ్ USD ఫోర్క్స్, స్పోర్టీ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇది హీరో మోటోకార్ప్ మొదటి 250సీసీ స్ట్రీట్ ఫైటర్ బైక్. KTM 250 డ్యూక్ వంటి బలమైన ప్రత్యర్థులతో పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఈ బైక్‌ అత్యుత్తమంగా ఉంటుంది.

ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 250R బైక్‌లో 4-వాల్వ్ సిస్టమ్‌తో కూడిన కొత్త 250cc లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 30 బిహెచ్‌పి పవర్,  25 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ హోరో బైక్ 3.25 సెకన్లలో జీరో నుండి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త హీరో బైక్‌లో రేడియల్ టైర్లను అమర్చారు.