Last Updated:

Cockfighting in Full Swing in AP: ఏపీలో జోరుగా కోడి పందాలు.. తెలంగాణ నుంచి వెళ్లిన రాజకీయ నేతలు

Cockfighting in Full Swing in AP: ఏపీలో జోరుగా కోడి పందాలు.. తెలంగాణ నుంచి వెళ్లిన రాజకీయ నేతలు

Political leaders of Telangana moved Cockfighting in Full Swing in AP: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట జోరుగా కొనసాగాయి. కనుమ పండుగ రోజు పందాలు జోరుగా సాగాయి. కోడిపందాల శిబిరాల్లో లక్షల్లో బెట్టింగ్‌లు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగగా, జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300కు పైగా బరులు ఏర్పాటు చేశారు. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు పందాలు, గుండాట జరిగినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ పందాలు, జూదం జరిగినట్లు సమాచారం. చాలా చోట్ల వీఐపీ పాసులు, సాధారణ పాసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200కి పైగా బరులు ఏర్పాటు చేశారు. మురమళ్లలో వీఐపీలో బరి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పందాలు జరిగినట్లు అంచనా. కొన్ని చోట్ల విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఆత్రేయపురంలో విజేతలకు బుల్లెట్లను బహుమతులు అందజేశారు.

రూ.300 కోట్ల వరకు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు మూడో రోజు జరిగాయి. పందాలకు బుధవారం వరకు అనుమతి ఉంది. పందాలకు అనుమతి లేదంటూ ప్రచారం జరిగింది. మూడు రోజులుగా సాగుతున్న కోడిపందాల్లో రూ.300 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందాల ముసుగులో యధేచ్ఛగా పేకాట, గుండాట జరిగాయి.

సాంప్రదాయం ముసుగులో..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సాంప్రదాయ ముసుగులో భారీఎత్తున జూద క్రీడలు కొనసాగాయి. ఇబ్రహీంపట్నం టెర్మినల్‌లో జూద క్రీడలు క్యాసినోను తలపించాయి. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌ గ్రూప్ సంస్థ జూద క్రీడలు నిర్వహిస్తోంది. ఆర్‌ఆర్ గ్రూప్ సంస్థ పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి.. ఆ సంస్థ ఇబ్రహీంపట్నానికి హైదరాబాద్ కల్చర్‌ను పరిచయం చేసింది. ఇంత జరుగుతున్నప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. భారీ ఎత్తున ముడుపులు చెల్లింపులు జరిగినట్లు సమాచారం.

1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు!
పందెంలో నిలిచిన నాలుగు పుంజుల్లో ఒకటి ఎటు కదలకుండా ప్రత్యర్థి కోళ్లపై దాడి చేయకుండా నిలబడి ఏకంగా 1.25 కోట్లు గెలుచుకుంది. ఆ వీడియోలో గ్రూప్ కోడి పందాల్లో భాగంగా నాలుగు పుంజులను ఒకేసారి బరిలో ఉంచారు. దీంతో ఓ మూడు కోళ్లు ఫైట్ చేయగా.. మరో కోడి దలకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అయితే ఆ మూడు కోళ్లు మాత్రం తీవ్రగాయాలతో ఒక్కోక్కటిగా కింద పడిపోయాయి. దీంతో సైలెంట్ గా నిల్చున్న కోడి విజయం సాధించి 1.25 కోట్లు గెలుచుకొని తనపై బెట్ పెట్టినవారికి కాసుల పంట పండించింది. దీంతో ఆ కోడిపై పోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవ్వగా, మెజారిటీ నెటిజన్లు.. ‘గొడవలు జరిగినప్పుడు ఏం చేయకపోవడమే ఉత్తమమైన మార్గం అనడానికి ఇదు నిదర్శనం’ అని రాసుకొచ్చారు. మరికొందరు ఫైస్టార్ చాక్లెట్ యాడ్‌ను గుర్తు చేశారు.