Last Updated:

Mahesh Babu: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీపై మహేష్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే..

Mahesh Babu: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీపై మహేష్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే..

Mahesh Babu Tweet About Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న జనవరి 14న విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ పండగ మూవీని దింపారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ డే భారీ ఒపెనింగ్ ఇచ్చిన ఈ సినిమా పండుగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజు ఈ సినిమా రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి వెంకటేష్ కెరీర్ హయ్యేస్ట్ ఒపెనింగ్ ఇచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖులను సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

దీంతో ప్రతి ఒక్కరు మూవీ బాగుందంటూ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమా ట్వీట్ చేశారు. తాజాగా ఈ సినిమా చూసిన ఆయన పర్పెక్ట్ పండగ మూవీ అని కొనియాడారు. ‘సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ప్రాపర్ ఫెస్టివల్ ఫిలిం. వెంకటేష్ సార్ యాక్టింగ్ టెర్రిఫిక్. బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొనసాగిస్తున్న మా డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూస్తుంటే గర్వంగా, సంతోషంగా ఉంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా చిన్నారి బుల్లిరాజు పాత్ర ఎంటైర్ సినిమాకు హైలెట్. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. మొత్తానికి ఈ సంక్రాంతికి పండుగ సరైన పండుగ దింపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీంకు, కాస్ట్ అండ్ క్రూకు నా అభినందనలు’ అంటూ మహేష్ రాసుకొచ్చారు. దీంతో పెద్దోడి సినిమాకు చిన్నోడి రివ్చూ అదిరింది అంటూ వారి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మహేష్ బాబు ఇచ్చిన మూవీకి మరింత ప్లస్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ట్విట్ సోషల్ మీడియాను ఆకట్టుకుంటుంది.

కాగా ఐశ్యర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. ఇందులో వెంకటేష్ భార్య భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా.. ఆయన మాజీ ప్రియురాలి మీనాక్షి చౌందరి నటించింది. ఈ సినిమా మొత్తానికి ఈ మూడు పాత్రలే బలం అనే రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూడు పాత్ర మధ్య వచ్చే కామెడీ సీన్స్ అలరించాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించారు.